తూర్పుగోదావరి: జిల్లాలోని రామచంద్రపురం మండలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్థానిక కళాశాలలో పాలిటెక్నికల్ చదువుతున్న విద్యార్థి పి.వెంకటేష్ బాణా సంచా కాలుస్తుండగా.. ప్రమాదవశాత్తు చెయ్యి పూర్తిగా దెబ్బతింది. వెంకటేష్‌ను స్థానిక జనసేన నాయకులు నారపరెడ్డి పార్థసారథి సహకారంతో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్‌కి తరలించారు. చెయ్యి పూర్తిగా దెబ్బతినడంతో వెంటనే కోయంబత్తూరు తీసుకెళ్లి చెయ్యి అమర్చాలని డాక్టర్లు సూచించారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం
