- అంతర్రాష్ట్ర రహదారి పై బారిగా నిలిచిపోయిన వాహనాలు
ప్రజాశక్తి - కొమరాడ
గత మూడు రోజులుగా కొమరాడ మెయిన్ రోడ్డు పై ఉన్న మద్యం షాపు మూసి వేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొమరాడ మెయిన్ రోడ్డు పై ఉన్న వైన్ షాపు వద్ద మద్యం సేవించి వెళ్తున్న వ్యక్తులపై కొమరాడ పోలీసులు కేసు నమోదు చేయడంతో గ్రామస్తులంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదేవిధంగా మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా రోడ్డెక్కారు. రోడ్డెక్కి ఆందోళ చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాగి నడుచుకుంటూ వెళ్తున్న వారిపై అక్రమంగా కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులంతా రోడ్డుపై ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. భారీగా వాహనాలు నిలిచిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా తరలించి కేసు నమోదు చేసిన వారిని తక్షణమే విడుదల చేసే వరకు ఆందోళన కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు తేల్చిచెబుతున్నారు. ఏమైనా ఈ ఆందోళన కార్యక్రమం అంతర్రాష్ట్ర రహదారిపై జరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మద్యం సేవించిన వారి అరెస్టుతో ఆందోళన ఉద్ధృతం చేసిన యువకులు
