-శ్రీకాకుళంలో అంగన్వాడీల ధర్నా
శ్రీకాకుళం : సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్లు సోమవారం అంగన్వాడీల ఐటిడి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీలకు రాత పరీక్షలు పెట్టి వారిని తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని అంగన్వాడీలంతా డిమాండ్ చేశారు. అనంతరం ఐటిడి పిఒ, అంగన్వాడీలతో మాట్లాడుతూ.. కేవలం అంగన్వాడీల ప్రతిభను తెలుసుకునేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగాలు తొలగించే ఆలోచన లేదని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో అంగన్వాడీల ధర్నా
