ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్‌కు చెందిన మరో భామ ముందుకొచ్చింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ కోసం తనవంతు సాయంగా నటి కంగన రనౌత్ రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చింది. అంతేకాదు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు అందరూ తమవంతుగా ఎంతోకొంత సాయం చేయాలని కోరింది. విరాళం ఎంత ఇచ్చినా అది బాధితులకు కొండంత అవుతుందని పేర్కొంది. దేశం మొత్తం కేరళ బాధితులకు అండగా ఉందని తెలిపింది. వారి కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొంది.
కేరళకు స్టార్ హీరోయిన్ రూ.10 లక్షల విరాళం
