- రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ప్రకాశం : ప్రకాశం జిల్లా టంగుటూరులో మంగళవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెళితే.. మంగళవారం ట్రాఫిక్ రద్దీ ఉన్న దృష్ట్యా టంగుటూరు రోడ్డులో డిఎస్పి, పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు సంచుల్లో ఎర్రచందనం దుంగల ముక్కలను తీసుకెళుతూ పట్టుబడ్డారు. పోలీసులు నిందితుల నుంచి ఎర్రచందనం దుంగల విషయాన్ని రాబట్టారు. నిందితులు చెప్పిన స్థావరంలో డిఎస్పి బి.శ్రీనివాసులు ఎర్రచందనం దుంగల్ని పరిశీలించారు. రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టివేత
