- పదేళ్ళలో 50శాతం పెరిగిన ఆల్కహాల్ సేవనం
- తాజా అధ్యయనంలో వెల్లడి
లాస్ ఏంజెల్స్ : అమెరికా యువతలో తాగుబోతులు 40శాతం మంది వున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. సబ్స్టెన్స్ యూజ్ అనే జర్నల్ ఈ అధ్యయనం ఫలితాలు ఈ వారంలో ప్రచురితమయ్యాయి. ఆరోగ్యానికి హాని కలిగే మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటున్న వారిలో 73శాతం మంది మరో నాలుగేళ్ళయినా తమ అలవాటు కొనసాగిస్తామని చెప్పారని, 15శాతం మంది మాత్రం ఆరోగ్యానికి చేటు కలిగేలా తాగడం లేదని తేలిందని అధ్యయనం పేర్కొంది. కొంతమంది బాగా తాగడం ఆపివేసినా, అసలు తాగుడు అనే అలవాటును మాత్రం ఏళ్ళ తరబడి కొనసాగిస్తున్నారని పేర్కొంది. బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (బియుఎస్పిహెచ్) ప్రొఫెసర్ అయిన రిచర్డ్ సైట్జ్ ఈ అధ్యయనం ఫలితాలతో నివేదిక రూపొంచారు. యువతలో ఇటువంటి అలవాట్లను మాన్పించాలంటే ఒకసారి ప్రజారోగ్య సందేశాలు ఇస్తే సరిపోదని, పదే పదే వాటిని ప్రసారం చేస్తుంటేనే ఫలితం వుంటుందని సైట్జ్ పేర్కొన్నారు. అమెరికాలో 34వేల మందికి పైగా యువతను ఇంటర్వ్యూలు చేసి సమాచారాన్ని సేకరించారు.
అమెరికా యువతలో 40శాతం తాగుబోతులే
