హైదరాబాద్ : శరత్ కొప్పు కుటుంబీకులు శరత్‌ను చంపిన దుండగుని గురించి విలేకరులతో మాట్లాడుతూ బుధవారం తమ స్పందన తెలిపారు. శరత్‌ను చంపిన వాడు ఎలా చచ్చాడున్నది ముఖ్యం కాదు' అంటూ శరత్ కుటుంబస్తులు అన్నారు. వరంగల్‌కు చెందిన శరత్ అనే యువకుడు అమెరికాలోని కన్సాస్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థానిక రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత శరత్‌ను చంపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ విషయం గురించి శరత్ కుటుంబీకులు మాట్లాడుతూ..'హింసకు సమాధానం హింస కాకూడదు. మా అబ్బాయిని చంపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో చనిపోయినందుకు సంతోషంగా ఉంది. కానీ వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నరకం అనుభవించేలా చేసి ఉంటే బాగుండేది. అమెరికా నుంచి శరత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేసింది. కానీ పరిహారంగా ఇప్పటివరకు ఎలాంటి సాయం శరత్ కుటుంబానికి అందలేదు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు రూ.30 లక్షలు ఖర్చు చేశాం.' అని శరత్ బంధువు ప్రసాద్ తెలిపారు. శరత్ మేనమామ శివుడు మాట్లాడుతూ..'నిందితుడు ఎలా చచ్చాడు అన్నది ముఖ్యం కాదు. ఏం చేసినా శరత్ తిరిగిరాడు. కానీ నిందితుడు చనిపోయాడన్న విషయం వార్తల్లో చూసి తెలుసుకున్నాం. అమెరికా అధికారుల నుంచి సమాచారం రావాలి' అన్నారు.
శరత్‌ను చంపిన దుండగునిపై కుటుంబసభ్యుల స్పందన
