న్యూఢిల్లీ: పంజాబ్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌మోడీ నుండి స్వాధీనం చేసుకున్న సంస్థల నుండి ఆభరణాలను కొనుగోలు చేసిన 50మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్ఐ) ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవసరమైన నగదుకు సంబంధించిన వివరాలను అందించాలని నోటీసులు పంపినట్లు తెలిపారు. ఎంపిక చేసిన కొనుగోలుదారులు చెక్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించినట్లు కొంత భాగాన్ని చెల్లించడం ద్వారా డైమెండ్ జ్యూలరీ సంస్థకు వారు మొత్తాన్ని చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువమంది నగదు రూపంలో చెల్లించలేదని పేర్కొన్నారని, అయితే వారు అందించిన వివరాలు ఆదాయపు పన్నుశాఖ వారి నివేదికలతో సరిపోలలేదని అధికారులు తెలిపారు. ఈ 50మంది కొనుగోలుదారుల 2014-2015 ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మరలా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఐటి అధికారులు ఇటీవల స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌కు చెందిన రేవారి ఆసుపత్రి సంస్థలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.
నీరవ్‌మోడీ నుండి నగలు కోనుగోలు చేసిన ఖాతాదారుల సంస్థలలో తనీఖీలు
