లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు పర్వతరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 121 వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ,మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ .రవిరాజు, పలువురు నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
