అమరావతి: బాలికపై అత్యాచారయత్నం నేపథ్యంలో గత నెల పాతగుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగుడిన ముస్లిములపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. వివరాలోకెళితే... గత నెలలో పాత గుంటూరులో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుని తమకు అప్పగించాలని ముస్లిములంతా పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. మంగళవారం విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటి సభ్యుడు గఫూర్ మాట్లాడుతూ ... గతంలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను ఆసరా చేసుకుని ముస్లిములంతా కలిసి టిడిపిని కాకుండా వైసిపిని గెలిపించారన్న కక్ష్యతో ప్రభుత్వం రాళ్లురువ్విన ముస్లిములను భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పారు. వారిలో 40 మందిని అరెస్టు చేశారు. ముస్లిములపై కేసులు పెట్టారు. పోలీస్‌స్టేషన్‌పై ముస్లిములు రాళ్లు రువ్వడం కావాలని చేసిన పని కాదు యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి వారిపై కేసులు తీసేయాలని డిమాండ్ చేశారు.
ముస్లిములపై కేసులు ఎత్తేయాలి : సిపిఎం గఫూర్
