- మధ్యప్రదేశ్ వ్యవసాయ మార్కెట్లో దుర్ఘటన
భోపాల్ : తాను పండించిన పంటను అమ్ముకోవాలని మధ్యప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ వెళ్ళిన మూల్చంద్ మైనా నాలుగు రోజులు ఓపిక పట్టినా, పంట అమ్ముడుకాకపోవడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించారు. తన తండ్రి శనగ పంట చేతికి రావడంతో నాలుగు రోజుల క్రితం అమ్మడానికి మండికి వెళ్లాడని, తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నాడని, గురువారం కూడా వేచి చూస్తుండగా కుప్పకూలిపోయాడని రైతు కుమారుడు పేర్కొన్నారు. పంటను అమ్మడం, తూకానికి రావాల్సిందిగా రైతుకు మేసేజ్ పంపామని, ఆ సమయంలోనే అనేక మంది రైతులు మండి మార్కెట్ తీసుకువచ్చారని, వారందరూ కూడా వారి సమయం వరకు వేచి ఉన్నారని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన పట్ల చింతిస్తూ రైతు కుటుంబానికి నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. గుండెపోటు కారణంగా రైతు మరణించారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనతో కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాథిత్య సింథియా ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి శోఛనీయంగా ఉంది. వారు పంటను వారు అమ్ముకోవడానికి రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆహారాన్ని అందించే రైతులు చనిపోతున్నారు.రాజకీయాలు చేయకండి అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ట్విట్టర్లో చురకలు అంటించారు.
పంట అమ్ముడుపోక రైతు మృతి
