విజయనగరం: విజయనగరంలో జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాలూరు, పార్వతీపురం, బబ్బిలి, చీపురుపల్లి, శఅంగవరపుకోట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భోగాపురం మండలం రాజపులోవలో పిడుగు పడి ఇద్దరు మఅతి చెందారు. దుక్క రాములమ్మ, మనవరాలు శ్రావణిగా గుర్తించారు. అలాగే పూసపాటిరేగ మండలం, రెల్లివలసలో పిడుగుపడి గౌరునాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు.