న్యూఢిల్లీ : ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసులో కార్తీ చిదంబరానికి అరెస్టు నుండి తాత్కాలిక రక్షణను మే2 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. ఎయిర్ సెల్ - మాక్సిస్కు సంబంధించి సిబిఐ, ఇడిలు రెండు కేసులు దాఖలు చేశాయి. ముందస్తు బెయిల్ కోరుతూ కార్తీ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనపై వాదనలు వినిపించేందుకు కొంత గడువు కావాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తరుపు న్యాయవాదితో కోరడంతోపాటు, విచారణను వాయిదా వేయాలని సిబిఐ న్యాయవాది కూడా విజ్ఞప్తి చేయడంతో ప్రత్యేక న్యాయమూర్తి ఓ.పి. సైని ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కార్తీ చిదంబరానికి అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట
