హైదరాబాద్: 2018-19 విద్యా సంవత్సరంలో భాషా పండితుల కాలేజీలు అఫిలియేషన్ పొందడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అఫిలియేషన్ కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అఫిలియేషన్ దరఖాస్తులకు ఈ నెల 19న తుది గడువు విధించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అఫిలియేషన్ కోసం రూ.75 వేలు ఫీజును చెల్లించాలని విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు.
9 నుంచి అఫిలియేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ
