నగరంలోని లంగర్‌హౌజ్‌లో సోమవారం ఓ కారు రహదారిపైనే దగ్ధమైంది. ఈ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన లంగర్‌హౌజ్ నానల్‌నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. చార్మినార్ నుంచి లంగర్‌హౌజ్‌కు నలుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా నానల్‌నగర్ చౌరస్తా వద్ద ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన వారంతా కారులో నుంచి దిగిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
లంగర్‌హౌజ్‌లో దగ్ధమైన కారు
