హైదరాబాద్: ప్రత్యేక విమానంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జేసీ ఢిల్లీ వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విమానయాన సంస్థలపై కేంద్రానికి ఎంపీ ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల విశాఖ, శంషాబాద్ విమానశ్రయంలో జరిగిన పరిణామాలను కేంద్రానికి నిశితంగా జేసీ వివరించనున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా అరుణ్ జైట్లీతో జేసీ సమావేశమయ్యే అవకాశముందని సమాచారం. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎంపీకి సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.