హైదరాబాద్: రేపు ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయనున్నారు. రేపు సీఎం కు నా రాజీనామా లేఖను అందచేయనున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ధూల్‌పేట ప్రజలకు మంచి చేస్తానని సీఎం మాటతప్పారు అనే విషయంపై రాజీనామా చేయనున్నారు. సారా వ్యాపారం మాని అందరూ రోడ్డున పడ్డారు అని రాజాసింగ్ అన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాకు ఓటర్ల నుంచి ఒత్తిడి పెరిగిందన్నారు. మంత్రులు ,అధికారులు పట్టించుకోవడం లేదు అని అన్నారు.