పిల్లలూ! మీరు ఎన్నో రకాల పక్షుల గురించి తెలుసుకుంటుంటారు కదా! మరి మీరెప్పుడైనా గనెట్ల గురించి విన్నారా?
- స్కాట్‌ల్యాండ్, బ్రిటన్‌తో పాటు ఈ పక్షులు ఐర్ల్యాండ్, ఐస్‌ల్యాండ్, కెనడా దేశాల్లో కూడా కనిపిస్తాయి.
- తెలుపు రంగులో ఉండే ఈ పక్షులు పొడవాటి మెడ, ముక్కుతోపాటు పొడవైన రెక్కల్ని కలిగుంటాయి. వీటి మెడ, తల భాగం పసుపు రంగులోనూ కాలి భాగం గోధుమరంగులోను, రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. తెల్లని రెక్కల చివర్లన ఉండే నలుపురంగు వీటికి ప్రత్యేక ఆకర్షణ.
- ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో అతి పొడవైన పక్షులు కూడా ఇవే.
- వీటి రెక్కలు ఒక్కటే దాదాపు 6.6 అడుగుల పొడవుంటాయంటే ఇవి ఎంత పొడవాటి పక్షులో అర్థం చేసుకోవచ్చు
- సాధారణంగా అన్ని పక్షలకు నాసిగా రంధ్రాలు వాటి నోటిపైభాగంలోనే ఉంటాయి. అయితే, వీటికి మాత్రం నోటి లోపలిభాగంలో ఈ నాసికారంధ్రాలుంటాయి.
- ఇవి స్పష్టమైన కంటి చూపును కలిగుంటాయి. మనం బైనాకులస్లో చూసే దూరపు దృశ్యాల్ని సైతం ఇవి మామూలుగానే చూసేయగలవు.
- రకరకాల సముద్ర జీవాల్ని ఆహారంగా తీసుకునే ఈ పక్షులు సముద్రపు చేపల్ని ఇష్టంగా లాగించేస్తుంటాయి.
- ఇవి 98 అడుగుల ఎత్తు నుంచి కూడా సముద్రాల్లోకి దూకి చేపల్ని పట్టేసుకోగలవు. సముద్రాల్లో మునకేయడమే కాదు, నీటిలోపలకు దాదాపు గంటకు 100 కి.మీ. వేగంతో ఇవి దూసుకెళ్ళగలవు కూడా. చేపరెక్కల్ని పోలుండే వీటి కాళ్ళ ద్వారా ఈ పక్షులు సముద్రాల్లో అత్యంత వేగంగా ఈదేస్తుంటాయట.
- ఇవి పిల్లల్ని పొదిగే నాటికి ఎక్కువగా స్కాట్‌ల్యాండ్‌కు వలస వెళుతుంటాయి. అలా వీటి వలసలతో అక్కడ ఒక గనెట్ కాలనీ కూడా ఏర్పడింది.
- ఈ వలసలకు ఓ రికార్డు ఉంది. అదేంటంటే 2014లో స్కాట్‌ల్యాండ్‌లోని బాస్రాక్ ఐల్యాండ్స్ మొత్తం 75 వేల జతల గనెట్లతో అతిపెద్ద గనెట్ కాలనీగా రికార్డుకెక్కింది.
- బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తిండిపోతుల్ని గానెట్ అని పిలుస్తుంటారట. దీనికి కారణం వీటికి అత్యధిక సంఖ్యలో చేపల్ని తినే అలవాటు ఉండటమే.
- పెద్ద పెద్ద సముద్ర చేపలు, వేటగాళ్ల దాడుల కారణంగా ప్రస్తుతం వీటి మనుగడ ప్రమాదకరంగా మారుతోంది.
గనెట్
