ఏనుగులు చాలా లావుగా ఎత్తుగా ఉంటాయి కదా. కానీ బోర్నియోలోని ఏనుగులు చాలా తక్కువ ఎత్తుతో ఉంటాయి. ఎంచక్కా పెద్దోళ్లు నించుని వాటిపైకి మిమ్మల్ని ఎక్కించేయొచ్చు. పెద్దవి కూడా చిన్న పిల్లల ముఖాలతో ముచ్చటగా ఉంటాయి. పెద్దగా అరుస్తూ భయపెట్టే మన ఏనుగుల్లా కాకుండా వాటికి మనుషులతో ఉండటం సరదా. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
- మలేషియాలోని సాబా అటవీ ప్రాంతం, ఉత్తర బోర్నియోలో, ఇండోనేషియాలోని కాళీమంతన్లో ఇవి జీవిస్తాయి.
- అంతరించిపోయే దశలో ఉన్న వీటిని కాపాడేందుకు అంతర్జాతీయ జంతు సంరక్షణ సంఘాలు పనిచేస్తున్నాయి.
- అన్ని ఏనుగుల కంటే చిన్నగా ఉండే ఇవి చిన్న పిల్లల ముఖాల్ని కలిగి ఉంటాయి.
- మనుషులతో తేలిగ్గా కలిసిపోతాయి. ఆఫ్రికా, ఆసియా ఏనుగుల్లా కాకుండా శాంత స్వభావం కలిగి ఉంటాయి.
- వీటి పిల్లలు మన నడుం ఎత్తుకు ఉంటే, పెద్దవి 7 నుంచి 9 అడుగులు ఉంటాయి.
- ఇవి ప్రత్యేకమైన జాతి ఏనుగులని పరిశోధకులు తేల్చారు.
-1757లో సుల్తాన్ షులూకు ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని పొట్టి ఏనుగుల్ని బహుమతిగా
-ఆ కాలంలో రాజులకు, పెద్దలకు ఏనుగుల్ని బహుమతిగా ఇవ్వడం సంప్రదాయం.
- ఆఫ్రికా జాతి వాటిలా ఆడ ఏనుగులకు పొడవాటి దంతాలు ఉండవు.
-వాటి నివాస ప్రాంతం 250 - 400 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
- అడవుల నరికివేత, వేటగాళ్ల వల్ల వీటి మనుగడ ప్రమాదంలో పడింది.
-2005 లెక్కల ప్రకారం 1184 - 3652 వరకు ఇవి ఉండొచ్చని అంచనా.
-పొలాల్ని ధ్వంసం చేస్తున్నాయని వీటికి విషం ఇచ్చి చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.
- వీటిని పిగ్మీ ఏనుగులని పిలుస్తారు.
- ఎండాకాలం, వర్షాకాలాల్లో అవి ప్రమాదం లేని, ఆహారం దొరికే ప్రాంతాలకు వెళ్లిపోతాయి.
- ఏనుగుల గుంపులో పెద్దవి ఆ దారిని గుర్తుంచుకుని మిగతా వాటిని తీసుకెళతాయి.
- చిన్న పిల్లల్ని గుంపులోని ఆడ ఏనుగులు ప్రేమగా చూసుకుంటాయి. వాటిని జాగ్రత్తగా కాపాడతాయి.
- తల్లి సంరక్షణలో 5 ఏళ్ల వరకు ఉన్న తర్వాత మగ ఏనుగులు వాటి ఇష్టానుసారం వేరేగా బతుకుతాయి. ఆడవి గుంపుతోనే ఉంటాయి.