ప్రజాశక్తి, తాడేపల్లిగూడెం రూరల్ (పశ్చిమగోదావరి)
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం కారు బోల్తా పడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం సమ్మయ్యపేటకు చెందిన మడుగుల గోపి (40) మృతి చెందాడు. పుణ్యవతుల అప్పలనాయుడు, చింతారెడ్డి నాగేశ్వరరావు, రాంబాబు విజయవాడ వెళ్లేందుకు సాయికి చెందిన కారును కిరాయికి మాట్లాడుకున్నారు. గోపితోపాటు మరో ఇద్దరు అయ్యప్పస్వామి మాల ధరించడంతో దైవదర్శనం నిమిత్తం గురువారం రాత్రి కారులో విజయవాడ బయలుదేరారు. కుంచనపల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పింది. గోపి మృతిచెందగా, మిగతా నలుగురూ గాయపడ్డారు.
కారు బోల్తా.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
