* జాషువా సాంస్కృతిక వేదిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక విద్యలో తెలుగు మీడియాన్ని రద్దుచేసి, ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 81కి వ్యతిరేకంగా రచనలు, కార్టూన్లు, కవితలు, లఘునాటికలను జాషువా సాంస్కృతిక వేదిక ఆహ్వానిస్తోందని జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు తెలిపారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు వచ్చిన రచనలు, కవితలు, కార్టూన్లలో ఉత్తమమైన వాటిని ఎంపికచేసి, వాటిని పుస్తక రూపంలో ప్రజలకు అందిస్తామని, లఘు నాటికలను వివిధ వేదికలపై ప్రదర్శిస్తామని తెలిపారు. లఘు నాటికల నిడివి 5 నిమిషాల లోపు ఉండాలని సూచించారు. వీటిని 2019 డిసెంబర్ 20వ తేదీ లోపు 27-30-4, జాషువా సాంస్కృతిక వేదిక, కేరాఫ్ ఎంబి విజ్ఞాన కేంద్రం, ఆకులవారి వీధి, గవర్నర్‌పేట, విజయవాడ-2 అడ్రస్‌కు లేదా jashuvasamskritikavedika@gmail.com కు లేదా వాట్సప్ నెంబర్ 9391163508కు పంపాలని కోరారు. కార్యక్రమంలో సునీల్ కుమార్, డివి రాజు, పిఎన్ఎం కవి, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణరావు పాల్గొన్నారు.
జిఒ 81కి వ్యతిరేకంగా రచనలకు ఆహ్వానం
