ప్రజాశక్తి- కడప అర్బన్
ఈతకు వెళ్లిన ఇద్దరు బదిరి విద్యార్థులు మతి చెందారు. కడప జిల్లా పాలకొండలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కడప నగరంలోని హెలెన్ కెల్లర్ డెఫ్ డిగ్రీ కళాశాలలో బికామ్ చదువుతున్న నాయబ్ రసూల్ (20), అనిల్‌కుమార్ (20) స్నేహితులతో కలిసి సరదాగా రిమ్స్ సమీపంలోని పాలకొండకు వెళ్లారు. పాలకొండ పరిసరాల సమీపంలోని ఓ నీటి మడుగులో ఈత కొడుతున్న సమయంలో లోతైన ప్రాంతంలోకి వెళ్లి బయటకు రాలేక మునిగిపోయి మతి చెందారు. అనిల్‌కుమార్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చెక్కలకొండ గ్రామానికి, నాయబ్ రసూల్ జిల్లాలోని కాశినాయన మండలం చెన్నారం గ్రామానికి చెందిన వారు. రిమ్స్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేశారు.
ఈతకు వెళ్లి ఇద్దరు బదిర విద్యార్థులు మృతి
