- ఏర్పేడు వద్ద పట్టాలు తప్పిన రైలు
ప్రజాశక్తి-ఏర్పేడు/శ్రీకాళహస్తి
ఢిల్లీ నుంచి కేరళ రాష్ట్రం త్రివేండ్రంకు సుమారు 15 వేల మంది ప్రయాణికులతో వెళుతున్న కేరళ ఎక్స్ప్రెస్కు శనివారం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికుల కథనం మేరకు..న్యూఢిల్లీ నుంచి త్రివేండ్రంకు కేరళ ఎక్స్ప్రెస్ శుక్రవారం బయల్దేరింది. శనివారం రాత్రి 8 గంటలకు ఏర్పేడు రైల్వే స్టేషన్ను సమీపిస్తుండగా రైలులోని క్యాంటీన్ బోగీ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో రైలులో ఒక్కసారిగా కుదుపులు చోటు చేసుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును ఆపేశాడు. ఒక్కసారిగా కుదుపులు రావడం, ఉన్నట్టుండి రైలు ఆగిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలీక ప్రయాణికులు ఆందోళన పడ్డారు. రైలు ఆగిన వెంటనే కిందకు దిగారు. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు.
కేరళ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
