* రాజధానిపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు సింగపూర్ కన్సార్టియం ప్రకటించింది. తొలుత అనుకున్న పద్దతిలో రాజధాని పరిధిలోని స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని కన్సార్టియం తరుపున మంత్రి ఈశ్వరన్ సింగపూర్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కూడా వేరుగా ఉన్న నేపథ్యంలో పరస్పర అంగీకారం మేరకు ఉమ్మడిగా ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు కన్సార్టియం ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసిన తరువాతే తాము రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్(ఎస్‌ఏఐహెచ్) ప్రకటించింది. ఉమ్మడిగా ఏర్పాటు చేసకున్న అమ రావతి డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రతినిధులు కూడా రద్దుకు సిద్దమయ్యారని పేర్కొంది. నూతన ప్రభుత్వం స్టార్టప్ ఏరియాలో కొనసాకూడదని నిర్ణ యించిందని, అది తన ప్రాధాన్యత కాదని తెలిపిం దని, ఈ నేపథ్యంలో తాము కొనసాగడం కష్టమని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఉందని, దీనివల్ల దేశంలో తమ పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ చూపదని ఈశ్వరన్ వెల్లడించారు. స్విస్‌ఛాలెంజ్ రద్దుపై చర్చలు జరు గుతున్నాయని సెప్టెంబర్ 23వ తేదీన ప్రజాశక్తి కథనం ప్రచురించింది. గత నెల మంత్రి బొత్స స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు నేపథ్యంలో ఇప్పటి వరకూ కుదుర్చుకున్న ఎంఓయులన్నీ రద్దు చేసుకునేందుకు అవసరమైన అన్ని అధికారాలనూ సిఆర్డిఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం భాగస్వామ్య వాటా కింద కన్సార్టియంకు రూ.7.90 కోట్లు చెల్లించేందుకు అవసరమైన చర్యలూ తీసుకోవాలని సూచించింది.
స్టార్టప్ రద్దు
