ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 మందికి స్వాతంత్య్ర దినోత్సవ పతకాలు దక్కాయి. అందులో రాష్ట్రపతి విశిష్ట సేవ పోలీస్ పతకం ఒకరికి, 14 మందికి మెరిటోరియస్ సేవ పోలీస్ పతకాలు, మరో ఇద్దరు జైలు అధికారులకు మెరిటోరియస్ సేవా పతకాలు వరించాయి. రాష్ట్రపతి విశిష్ట సేవ పోలీస్ పతకం కర్నూల్ ఎసిబి డిఎస్పీ చామర్తి జయరామ రాజును వరించింది. మెరిటోరియస్ సేవ విభాగంలో రాజీవ్ కుమార్ మీనా (ఐజిపి, గుంటూరు రేంజ్), జి.విజరు కుమార్ (ఇంటెలిజెన్స్ ఎస్పీ, విజయవాడ), గొల్ల రామాంజనేయులు (అడిషనల్ ఎస్పీ, అనంతపురం), కె.భాస్కర రావు (డిఎస్పీ, మంగళగిరి), వాసగిరి గిరిధర్ (క్రైం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుపతి), పి.శరత్‌బాబు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విజయవాడ), బి.సోమయ్య (అసాల్ట్ కమాండర్), జె.నరసింహమూర్తి (హెడ్ కానిస్టేబుల్, కాకినాడ), వి.విశ్వనాథ్ నాయుడు (ఎసై, చిత్తూరు), టి.శ్రీనివాసరావు (ఎఎస్ఐ, మంగళగిరి), బి.జయరాముడు (ఎఎస్ఐ, కడప), వి.వీరాంజనేయులు (ఎఎస్ఐ, పోరంకి), జి. అరుణ్ ప్రసాద్ (ఎఎస్ఐ, గుంటూరు), ఎం.కృష్ణ (కానిస్టేబుల్, మంగళగిరి)లకు పోలీస్ పతకాలు దక్కాయి. అలాగే మెరిటోరియస్ సేవ విభాగంలో ఎం. వేణుగోపాల్ రెడ్డి (జైలర్, జిల్లా సబ్ జైల్ అధికారి, విజయవాడ), ఎ.శేష హనుమాన్ (హెడ్ వార్డెన్, జిల్లా జైల్, ఏలూరు)లకు పతకాలు దక్కాయి.
17 మంది రాష్ట్ర పోలీసులకు సేవా పతకాలు
