- పోలవరానికి 25 శాతం నిబంధన దెబ్బ
- డోలాయమానంలో 41 నిర్వాసిత కాలనీలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:
పోలవరం ప్రాజెక్టులో పునరావాసం పనులకు ఆటంకాలు ఎక్కువవుతున్నాయి. కొత్తగా అధికారం చేపట్టిన జగన్ సర్కారు 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన పనులను ఆపివేయాలని అన్ని నిర్మాణ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిరది. ఈ ఆదేశాలు రాజధాని నిర్మాణంతోపాటు నీటిపారుదల పథకాలకు కూడా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే పునరావాసానికి ఈ షరతులు వర్తిస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీ యారశంగా మారిరది. అరదుకే తమ అనుమా నాలను నివృత్తి చేయాలని ఆ శాఖ అధికారులు ఆర్ధికశాఖను ఆశ్రయిరచారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నప్పటికీ, పునరావాసం పూర్తికానిదే ప్రాజెక్టు ఫలితాలు రైతులకు, ప్రజలకు అరదుబాటులోకి వచ్చే పరిస్థితి వుండదు. ప్రాజెక్టు పరిధిలో మురపునకు గురయ్యే గ్రామాల వారిని తరలిరచి వేరే ప్రారతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేరదుకు కాలనీలను ప్రారంభిరచిరది.
అయితే ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాలనీల నిర్మాణం మాత్రం వేగవంతం కావడం లేదు. నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మేరకు 25 శాతం నిబంధన కారణంగా దాదాపు 90 శాతం వరకు పనులకు ఇబ్బరది కలిగే పరిస్థితి ఉరటురది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 15,261 ప్రాజెక్టు బాధిత కుటుంబాల కోసం 48 కాలనీలు వివిధ ప్రారతాల్లో నిర్మిరచేరదుకు ప్రభుత్వం నిర్ణయిరచిరది. ఇరదులో రామన్న గూడెంలోని ఒక కాలనీ నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాకపోగా, మిగిలిన 47 కాలనీల నిర్మాణం ప్రారంభరకాగా వాటిల్లో ఇప్పటికీ 40 కాలనీల నిర్మాణం 25 (ఖర్చు పరంగా) శాతానికి మిరచి జరగలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు. ఇరదులో తూర్పు గోదావరి జిల్లాలో 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 26 కాలనీలు ఉన్నాయి.కాలనీల నిర్మాణంలో ఆర్ధికంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే రూ.488 కోట్లు విలువగల ఇళ్ల నిర్మాణం, రూ.1,290 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మొత్తం రూ.1,778 కోట్లతో నిర్వహిరచాల్సి ఉరది.
అయితే కేవలం రూ.241 కోట్ల రూపాయల విలవైన పనులు మాత్రమే జరిగినట్లు గుర్తిరచారు. ఇరదులో ఇళ్లకు రూ.177 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇరతలా పనుల్లో జాప్యం జరగ డానికి కారణాన్ని కూడా అధికారులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను గుర్తిరచ డం, ఇళ్ల ప్లాన్లను సిద్ధం చేయడం, ట్విన్ హౌసెస్ గుర్తిరపు, సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లుల చెల్లిరపు, ఆర్ధికశాఖ అనుమతి రాకపోవడం, ఫిబ్రవరి నురచి బిల్లులకు నిధులు ఇవ్వకపోవడం వంటి అరశాలే కాలనీల నిర్మాణంలో జాప్యానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 25 శాతం కంటె తక్కువగా పని జరిగిన వాటికి సంబంధించిన నిబంధనను ఎలా అమలు చేయాలన్న అంశంపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు నీటిపారుదల శాఖ అధికారి ఒకరు వెల్లడిరచారు.
పునరావాసం ఎలా?
