- ఎండల నేపథ్యంలో పొడిగించిన విద్యాశాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో ఒంటిపూట బడులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి 17వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఈ నెల 11న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా ఈ నెల 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం వెంకట కృష్ణారెడ్డి ఆదివారం సర్క్యులర్ జారీ చేశారు.
22 వరకు ఒంటిపూట బడులు
