ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :
ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసు విషయంలో ఎన్ఐఎ విచారణ నిలుపుదల చేసేలా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిిటిషన్పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈనెల 30 లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సంబంధించిన ఫైళ్లను కోర్టు ముందు పెట్టాలని ఎన్ఐఎను ఆదేశించింది. ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాబట్టి సుప్రీంకోర్టులో మాత్రమే విచారించాలని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు.
ఎన్ఐఎ విచారణపై కేంద్రానికి నోటీసులు
