ప్రజాశక్తి- హిందూపురం(అనంతపురం):
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని సోమవారం కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఈ బృందంలోని డాక్టరు పొన్నురాజు, డాక్టరు నాగరాజు, డాక్టర్ మినీమాల ముగ్గురు కలిసి ఆస్పత్రిలోని 14 విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర బృందం తనిఖీలు చేసేందుకు వస్తున్నారని సమాచారం తెలిసినప్పటికీ ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు మధ్నాహ్నం 12 గంటలు అయినా రాకపోవడంతో బృంద సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బృంద సభ్యులు అత్యవసర విభాగం, మందుల విభాగం, మాతా శిశు ఆసుపత్రిలను పరిశీలించారు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
'అనంత' వైద్యుల తీరుపై కేంద్ర బృందం అసంతృప్తి
