- 'ఏడవ రుతువు' పుస్తకావిష్కరణలో సాహితీ స్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్
ప్రజాశక్తి - సత్యనారాయణపురం (విజయవాడ)
పాఠకుల్ని కదిలించి సమాజాన్ని ప్రభావితం చేసే కవిత్వం రావాల్సిన అవసరం ఉందని సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ అన్నారు. వైష్ణవిశ్రీ రాసిన కవితా సంకలనం 'ఏడవ రుతువు' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సాహితీస్రవంతి అమరావతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వొరప్రసాద్ మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అభద్రతా భావం గురించి రచయిత్రి ఈ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన కమిటీ ప్రధాన కార్యదర్శి ఒ.శాంతిశ్రీ మాట్లాడుతూ సమాజ మార్పుతోనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందన్నారు. ప్రముఖ రచయిత్రి మందరపు హైమవతి 'ఏడవ రుతువు' పుస్తకాన్ని పరిచయం చేశారు. పుస్తకం తొలిప్రతిని మోతి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కవి అనిల్ డానీ, సాహితీస్రవంతి అమరావతి గౌరవాధ్యక్షులు సత్యాజీ ఆప్తవాక్యం పలికారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి వైష్ణవిశ్రీ, పలువురు సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.
సమాజాన్ని ప్రభావితం చేసే కవిత్వం రావాలి
