ప్రజాశక్తి - చిలకలూరిపేట (గుంటూరు జిల్లా)
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశువుల అందాల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు గురువారం వరకూ కొనసాగనున్నాయి. తొలిరోజు పోటీల్లో 28 ఎడ్ల జతలు పాల్గొ న్నాయి.ఎన్టిఆర్ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర ఫౌండేషన్, మల్లెల సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశు పోషణను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం రాయితీపై గేదెలు, ఆవులను అందిస్తోందని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ప్రారంభం
