- ఎపికి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి : మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ప్రజాశక్తి - కడపప్రతినిధి
కాంగ్రెస్‌తో కూటములు కడితే ప్రాంతీయ పార్టీలు భూస్థాపితం కావడం తథ్యమని కేంద్రహోంశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ అన్నారు. శుక్రవారం కడపలో కందుల గ్రౌండ్స్‌లో రాయలసీమ జిల్లాల బూత్‌స్థాయి శక్తి కేంద్ర సమ్మేళన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో బిఎస్పి, ఎస్పిలు కలుసుకుని కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 55 ఏళ్ల కాంగ్రెస్‌పాలనలో దేశం వీధి దీపాలకు సైతం నోచుకోలేదని, నాలుగున్నరేళ్ల పాలనలో బిజెపి ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులను పంచిందన్నారు. ఎపి అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించలేదన్నారు. ఎపికి స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ట్రీట్మెంట్ అవసరమని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను 80 శాతం అమలు చేశామన్నారు. దేశంలో ఆర్థికంగా వెనకబడిన పేదలకు 10శాతం రిజర్వేషన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్,ఎపి బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రాంమాధవ్, బిజెపి అధ్యక్షులు కన్నా లకీëనారాయణ, రాయలసీమ జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో కలిస్తే భూస్థాపితమే
