ప్రజాశక్తి - జగ్గంపేట (తూర్పుగోదావరి):
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో డెంగీతో ఓ మహిళ మృతి చెందింది. మల్లిసాలకు చెందిన పాలిపిరెడ్డి నూకరత్నం, కోన మాధవి డెంగీ లక్షణాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్లో చేర్పించారు. ఈ క్రమంలో కాకినాడ జిజిహెచ్లో చికిత్స పొందుతూ పాలిపిరెడ్డి నూకరత్నం (55) శనివారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కోన మాధవి ప్రస్తుతం కాకినాడ జిజిహెచ్లో చికిత్స పొందుతోంది. అప్రమత్తమైన వైద్యశాఖాధికారులు ఆదివారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
డెంగీతో మహిళ మృతి
