- డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించిన యువత
ప్రజాశక్తి-యంత్రాంగం:
డిఎస్సి, ఇతర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. డిఎస్సి, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరుద్యోగులు మంగళవారం రాస్తారోకో చేశారు. తొలుత ఆర్ఐఒ కార్యాలయం నుంచి వై.జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అరగంట పాటు వై.జంక్షన్లో రాస్తారోకో చేశారు. డిఎస్సిని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఎపిపిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని నినదించారు. డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో డివైఎప్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడారు. కార్యక్రమానికి డివైఎప్ఐ జిల్లా అధ్యక్షులు కెఎప్ బాబు అధ్యక్షత వహించారు. కృష్ణాజిల్లా నందిగామ గాంధీ సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేల డిఎస్సి పోస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్లకై రాస్తారోకోలు
