ప్రజాశక్తి-పెనమలూరు (విజయవాడ):
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఓ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్రి వెంకటేశ్వరరావు(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా పొలాలను కౌలుకు తీసుకుని తమలపాకు పంట పండిస్తున్నాడు. పంట దిగుబడి ఆశించిన మేరకు రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించక పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావును చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెనమలూరు సిఐ దామోదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌలు రైతు ఆత్మహత్య గురించి తెలుసుకున్న వెంటనే మండల తహశీల్దార్ వి.మురళీ కష్ణ రైతు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలిపారు.రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎస్ఐ గురు ప్రసాద్, హార్టికల్చరల్ అధికారి జ్యోతి ఉన్నారు.
కౌలు రైతు ఆత్మహత్య
