- లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, పూర్వ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. గ్రామ సర్పంచిలపై ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల పెత్తనం అధికం కావడంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ విద్యుత్ నగర్లోని ఎ కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సర్పంచులకు పూర్తి అధికారాలు ఉన్న ప్పటికీ, ఒత్తిడులు అధికంగా ఉండడంతో పని చేయలేకపోతున్నారని విమర్శించారు. సర్పంచే స్వతంత్రంగా నిధులు ఖర్చు చేసి గ్రామ సమస్యలను పరిష్కరిస్తే దేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుం దన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే అతిపెద్ద దేశమైన భారతదేశ రాజకీయాల్లో కులం బాగా రాజ్యమేలుతోందని, ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుగొమ్మలు : చినరాజప్ప
దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుగొమ్మలని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ విద్యుత్ నగర్లోని ఎ కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని కోరారు.
స్థానిక సంస్థలపై ఎమ్మెల్యేల పెత్తనం ఎందుకు?
