ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రాష్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ బడాయిదేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పద్దులు రాశారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఖర్చు చేసే సమయంలో కోతలు విధించినట్లే ఇప్పుడూ రూ.1.91లక్షల కోట్ల బడ్జెట్ను ప్రజల ముందు ఉంచారని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమం పేరిట భారీ కేటాయింపులు చూపించారని, ఖర్చు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో వివరించలేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీకి కేవలం రూ.4100 కోట్లు కేటాయించారని, రైతుల రుణాలు ఈ ఏడాది తీరవని స్పష్టమవుతోందని తెలిపారు.
బడ్జెట్ః బడాయి బడ్జెట్ : రామకృష్ణ
