- 650 మందికి వైద్య పరీక్షలు
ప్రజాశక్తి - నెల్లూరు సిటీ :
నెల్లూరులో జనవిజ్ఞాన వేదిక, జెట్టి శేషారెడ్డి ట్రస్టు భవన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జెట్టి శేషారెడ్డి ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ శ్రీను నాయక్, సుధాకర్, డాక్టర్ దత్తాత్రేయులు, ఖాదర్‌బాషా (ప్రభుత్వ వైద్యులు) పాల్గొని 650 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు సెక్రటరీ జి.కామయ్య మాట్లాడుతూ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు నెలలకు సరిపడా మందులు ఇచ్చామన్నారు. బిపి, సుగరు, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు సంబంధించిన మందులను బయట మార్కెట్లో రూ.1000 విలువ చేసే వాటిని కేవలం రూ.200 లకే ఇచ్చామన్నారు. రూ.140 విలువ చేసే ఇన్సులిన్ మందును కేవలం రూ.80లకే అందించామన్నారు. కార్యక్రమంలో జెవివి నాయకులు పి.బుజ్జయ్య, భాస్కరరావు, ట్రస్టు మేనేజింగ్ కన్వీనర్ చలపతి, ట్రెజరర్ జయరామిరెడ్డి పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సిబ్బంది, రామచంద్రారెడ్డి ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు వలంటీర్లుగా వ్యవహరించారు.
'జెవివి, జెట్టి శేషారెడ్డి' ఉచిత వైద్య శిబిరం
