కర్నూలు : గోనెగండ్ల మండలం గంజిహాళ్లి వద్ద మల్లెల వాగులో 14 మంది కూలీలు చిక్కుకున్నారు. పొలం పనులు ముగించుకుని వస్తుండగా కూలీలు వాగులో చిక్కుకున్నారు. ఈమేరకు వాగులో చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్నారులు, 8 మంది మహిళలుగా గుర్తించారు. ఈనేపధ్యంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసులు వెనుదిరిగారు. వాగులోతు అంచనా తెలియక ఎటూ కదలలేని స్ధితిలో వాగులోనే కూలీలు ఉండిపోయారు.