- వైసిపి అధికార ప్రతినిధి పార్థసారథి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా మారిందని వైసిపి అధికార ప్రతినిధి కె పార్థసారథి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరుగున పడేసి, కొత్త రకం దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సొమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లో తిరిగి అధికారంలోకి రాలేమని, తన కుటుంబసభ్యులు, అనుయాయులు, పార్టీ నేతలకు రాష్ట్ర ఆదాయ వనరులను అప్పజెప్పే కుతంత్రంతో సిఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. మద్యం షాపులు, బార్ల లైసెన్సులను తన వాళ్లకు కట్టబెట్టాలే పథకాలు రచిస్తున్నా రన్నారు. అధికారం చేపట్టగానే చేసిన ఐదు సంతకాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరు మీద రూ.2 లకే మినరల్ వాటర్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. కనీసం ఆయన పెట్టిన సంతకానికి విలువ ఉందని చంద్రబాబు భావిస్తే... ఎంతమందికి ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. 2030 వరకు రాష్ట్రంలో మద్యం కొరత లేకుండా డిస్టిలరీలకు లైసెన్సులిచ్చారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలనూ పట్టించుకోకుండా విచ్చలవిడిగా వైన్ షాపులకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు..
