- అసెంబ్లీలో తడబడ్డ సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
'అవినీతిలో, అభివృద్ధిలో దేశంలో మేమే ముందున్నాం' ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ మొదలైన అనంతరం సిఎం సుదీర్ఘంగా మాట్లాడారు. ఇదే సమయంలో జగన్పై వ్యాఖ్యానాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడి మైక్ కట్ చేసిన సమయంలో వైసిపి సభ్యులుందరూ వెల్లోకి దూసుకొచ్చారు. అక్కడ నినాదాలు చేస్తుండగా సిఎం సహనాన్ని కోల్పోయారు. అభివృద్ధి గురించి మాట్లాడే సమయంలో ఆవేశంగా మాట్లాడుతూ అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ తామే ముందున్నామన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులందరూ నవ్వుతూ నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
అవినీతిలో మేమే ముందున్నాం
