- సుప్రీం కేసులో ఇంప్లీడ్ కానున్న
తెలుగు రాష్ట్రాలు
- సంసిద్ధమైన తెలంగాణ సర్కార్
- అదే బాటలో ఏపి
- న్యాయశాఖ అధికారుల కసరత్తు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ప్రజలకు అదించే కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం తగదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒక రాష్ట్రం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయిరచిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ కావాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే కోవలో కేసులో ఇంప్లీడ్ కావాలని ఆలోచన చేస్తోరది. దీనికి సంబంధించి న్యాయశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసిరది.
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, ఓటర్ల జాబితా వంటి అంశాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తున్నాయి. అయితే దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని, అందుకే ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం ద్వారా అసలు లబ్దిదారులకే ప్రయోజనాలు అందించేందుకు ఆస్కారం ఉంటురదని, నకిలీలను అరికట్టేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్న ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో కంగుతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించగా, ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో సమాలోచనలు చేసుకురటోరది.
ఆధార్ ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది, ప్రజా ప్రయోజనాలకు భంగం కానీయకుండా ఎలా అమలు చేస్తున్నామన్న కోణంలో సవివరంగా నివేదికలను తయారు చేయాలని న్యాయశాఖకు సూచనలు చేసినట్లు తెలిసిరది. వీలయినంత త్వరగా నివేదికలపై దృష్టి పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, పథకాల అమలుకు సంబంధించి రెరడు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉప్పడి రాష్ట్ర సమయంలో జరిగిన అక్రమాలనే ఉదాహరణగా చెప్పుకుంటూ వస్తున్నాయి. అప్పట్లో బలహీనవర్గాలకు ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, రైౖతులకు రుణాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు చెబుతూనే ఉన్నారు. వాటిని సరిదిద్దాలని, గత అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతూ మంత్రులు, అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటుచేశారు.
అక్రమాల వల్ల నిజమైన పేదల లబ్దిదారులు నష్టపోతు న్నారని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకే ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా అర్హులకు ప్రయో జనాలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ అనుసంధానం ద్వారా గత అక్రమాలు పునరావృతమవుతాయన్న భావాన్ని వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం అదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు.
ఆధార్ కావాల్సిందే!
