ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగవంతం అవుతుందని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. హోదా ఇచ్చే సత్తా కాంగ్రెస్‌పార్టీకే ఉందని, తీసుకురాలేకపోతే నియోజకవర్గంలో అడుగుపెట్టనని శపథం చేశారు. శుక్రవారం హిందూపురంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఆయన మాట్లాడారు. గురువారం ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 30 అంశాలపై చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీచేస్తే ఎపి ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. బిజెపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రజలు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని కాంగ్రెస్‌ను బలపరిస్తే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటా కార్యక్రమాలు విస్తృత స్తాయిలో తీసుకెళతామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, రాష్ట్ర అదికారి ప్రతినిది, నియోజకవర్గ ఇన్చార్జ్ బాలాజి మనోహర్, స్ధానికనాయకులు నాగరాజు, శైవలి రాజశేఖర్, ఆదిమూర్తి, రహమత్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
గుడిబండ :భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాలను కుల,మతాలకు అతీతంగా సాధిస్తామని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ స్వగ్రామం కిరికెరలో శుక్రవారం విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవానికి పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విగ్రమ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కుల, మతాల పేరిట రాజకీయం చేసే పార్టీలు పుట్టుకొస్తున్నాయని అలాంటి పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కుల,మతాల రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అగ్ర కులాల్లో వెనుకబడ్డ నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు గోవిందగౌడ్, వరదరాజులు, ఎల్‌కె నరసింహప్ప, ఎబ్లాక్ అధ్యక్షుడు దొడ్డయ్య మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు నాగభూషణ, రంగనాథ్, నాగేంద్ర, అశ్వర్థనారాయణ, రాయుడు, శశిధర్, ఎస్‌హెచ్ రాయుడు, నరసయ్య, రుద్రముని, చిన్న, రంగనాథ్, భీమరాజు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి
