- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ప్రజాశక్తి - హైదరాబాద్
యూనివర్సిటీ ఛాన్సరల్, వైస్ ఛాన్సలర్ల నియామకాలకు విద్యార్హతల్ని నిర్ణయించారో లేదో తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన కేసును ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ప్రముఖ వ్యక్తి అయితే ఛాన్సరల్, వైస్ ఛాన్సరల్గా భర్తీ చేయవచ్చునా.. అని బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ యివ్వాలని, విచారణ 21వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. యూజీసీ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా చట్టముందని, దీనిని కొట్టివేయాలని దాఖలైన పిల్‌పై విచారణ గురువారం కొనసాగనుంది.
ప్రముఖుడైతే చాన్సలర్‌గా చేయవచ్చా..?
