- మంత్రి రావెల కిశోర్‌బాబు
ప్రజాశక్తి-గుత్తి
రాష్ట్రంలోని క్రిష్టయన్ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. పట్టణంలోని బైబిల్ మిషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక లోటు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారన్నారు. విశాఖపట్నంలో క్రైస్తవ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.పదికోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మున్సిపల్ ఛైర్పర్సన్ తులసమ్మ, కౌన్సిలర్లు గోవిందు, రమేష్, సరస్వతి, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దిల్కాశీన, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
క్రిష్టయన్ మైనార్టీల సంక్షేమానికి కృషి
