మాది జాయింటు ఆస్తి. మా పెదనాన్నగారమ్మాయి అమెరికాలో ఉంటూ ఆమె వాటా ఆస్తి నన్ను అమ్మి పెట్టమని 'పవరాఫ్ అటార్నీ' ఇచ్చింది. దాన్ని అమ్మనీయకుండా మా బంధువు ఒకాయన దుష్ప్రచారం చేస్తూ.. అడ్డుపడుతున్నాడు. అది ఉమ్మడి ఆస్తి అంటూ బేరాలు చెడగొడుతున్నాడు. పంచాయతీ వాళ్లను నా కజిన్ పేరుమీద హక్కు పత్రం ఇమ్మంటే ఇల్లుకి ఇస్తాం, పన్ను కడుతున్నారు గనక. ఖాళీ స్థలం కాబట్టి రెవెన్యూ వాళ్లనడగమన్నారు. రెవెన్యూ వాళ్లు పంచాయతీదే బాధ్యత అంటున్నారు. నేను అటూ ఇటూ తిరుగుతూ విసిగిపోతున్నాను. నేనేం చెయ్యాలి?
- కె. రామ్మోహన్రావు, నందమూరు.
మీ ఊళ్లోగల పెద్ద మనుషులతో పంచాయతీ ప్రెసిడెంటుగారికి చెప్పించండి. మీ వద్దగల రికార్డు ఫొటోస్టాట్తో ఒక అర్జీ దాఖలు చెయ్యండి. వాళ్లు ఇవ్వకపోతే, ఇదే విధంగా అర్జీతో వీఆర్వోని కలవండి. అవసరమైతే ఎమ్ఆర్వోని కలుసుకోండి. మీకు పరిష్కారం లభించగలదు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
హైకోర్టు న్యాయవాది, విజయవాడ.
ఫోన్ నెం : 8330968901
ఇ మెయిల్ : katururavindratrivikram@gmail.com