వరిలో కలుపు నివారణకు ఎక్కువ ఖర్చవుతుంటుంది. శ్రీ సిష్టమ్ ఆఫ్ రైస్ ఇన్టెన్సిఫికేషన్ (శ్రీ) సాగు పద్ధతిలో వరి మొక్కలకు మధ్య ఎడం పెరుగుతుంది. అందువల్ల కలుపు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దుబ్బులు పెద్దగా వస్తాయి. దిగుబడి పెరుగుతుంది. కానీ ఈ పద్ధతిలో వరిసాగుకు కలుపు తీతే అధికదిగుబడికి ఎక్కువ దోహదపడుతుంది. తక్కువ వ్యయంతో కలుపుతీత పరికరాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీంట్లో కోనోవీడరు అనేది రూ.1500 ధరలోపే లభ్యమవుతుంది. దీన్ని ఐఆర్ఆర్ఐ రూపొందించింది. దీన్ని శ్రీ సాగు వరి సాళ్లలో తిప్పితే అక్కడ ఖాళీల్లో ఉండే గడ్డి తదితర కలుపు మొక్కలను ఇది పీకేసి మట్టిలోనే వాటిని అణచి వేస్తుంది. ఆకలుపు మొక్కలే కుళ్లి వరికి ఎరువుగా కూడా ఉపయోగపడాయని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ చిన్ని పరికరంతో రోజుకు అరెకరం పొలంలో రైతు తనకు తాను కలుపు నివారణ చేసుకోవచ్చంటున్నారు.
వరిలో కలుపు తీతకు కోనోవీడర్
