ఎండలో తిరగడం వల్ల ముఖానికి మురికిపట్టడం సహజం. దానివల్ల ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. మురికి ప్రభావం కనిపించకుండా ఉండాలంటే ప్రత్యేకంగా రోజుకొకసారి ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. అందుకు వంటగదిలో లభించే పదార్థాలు ఎంతగానో ఉపకరిస్తాయి. టమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపటికి కడిగేసుకుంటే మురికిపోవడంతోపాటు ముఖానికి మంచి మెరుపు వస్తుంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి రాత్రి నిద్రకు ముందు రాసుకోవాలి. ఇలా వారం రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే చర్మం రంగు ఎంతో మెరుగుపడుతుంది. ఓట్స్ను పొడిగా చేసి, అందులో కొంచెం మజ్జిగ వేసుకుని మురికిపట్టిన ప్రదేశంలో సున్నితంగా మర్దన చేయాలి. అలా చేస్తే మురికిపోయి, చర్మం ఎంతో నిగారింపుగా కనిపిస్తుంది.
ముఖం మెరవాలంటే!
